1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Allari Naresh

Betting Bangarraju | Allari Naresh | Nidhi | Usha Kiran Movies | Ramoji Rao | "బెట్టింగ్ బంగార్రాజు"గా వస్తోన్న అల్లరి నరేష్!

బెట్టింగ్ బంగార్రాజు
WD
నరేష్‌తో ఉషాకిరణ్‌మూవీస్ నిర్మిస్తోన్న చిత్రానికి "బెట్టింగ్ బంగార్రాజు" పేరును ఖరారు చేశారు. రామోజీరావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్ ముగింపులో ఉన్న ఈ చిత్రాన్ని నరేష్ బాడీలాంగ్వేజ్‌కు తగిన కథతో ఆద్యంతం హాస్యాభరితంగా రూపొందించామని దర్శకుడు తెలిపారు. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్రేమకథా చిత్రమిదని సత్తిబాబు అన్నారు. త్వరలో ఆడియోను, సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇంకా ఈ చిత్రానికి సంభాషణలు: నాగరాజు గంథం, సంగీతం: శేఖర్ చంద్ర, ఆర్ట్: నాగేంద్ర, కథ: లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: కరుణమూర్తి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబు.
About Writer
SELVI.M