1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram charan

Actress Shazahn | Ram charan | Anjala Jhaveri | Bhumika Chawla | Shriya Saran | Genelia | Ileana | "మగధీర" రామ్‌చరణ్‌తో "రాకెట్ సింగ్" గాళ్

రామ్ చరణ్
దక్షిణాది దర్శకనిర్మాతలు ఉత్తరాది భామలకోసం చూస్తుంటారు. దానికి తగ్గట్లుగానే టాలీవుడ్‌కు వచ్చిన సెక్సీ భామలు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటి వరకూ బాలీవుడ్ నుంచి అంజలా ఝవేరీ, నమ్రత, భూమిక, శ్రియ, ఆర్తీ అగర్వాల్, జెనీలియా, ఇలియానా, కామ్నా వంటి ఎందరో ఉత్తరాది తారలు టాలీవుడ్‌లో సక్సెస్ సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించుకున్నారు.

తాజాగా హిందీ చిత్రం రాకెట్ సింగ్‌లో నటించిన కథానాయిక షాజాన్ రామ్ చరణ్ సరసన నటిస్తోంది. సుప్రసిద్ధ పాప్ గాయకుడు షరోన్ ప్రభాకర్ కుమార్తె అయిన షాజాన్ తొలిచిత్రం రాకెట్ సింగ్. ఈ హిందీ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా షాజాన్ నటన చక్కగా ఉందన్న ప్రశంసలు వచ్చాయి.

అంజనా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన షాజాన్‌తోపాటు జెనీలియా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT