Buridi, Shooting, Evv Satyanarayana, Aryan Rajesh | శరవేగంతో "బురిడి" షూటింగ్
WD
ఆర్యన్ రాజేష్, నూతన తార ఐశ్వర్య జంటగా బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇప్పటి వరకూ రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, అలీ, జ్యోత్స్న, జయప్రకాష్ రెడ్డి, శకుంతల తదితరులపై కామెడీ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఇవివి సత్యనారాయణ శనివారం తెలిపారు.
ఆద్యంతం వినోదభరితంగా సాగే ఇతివృత్తంతో నిర్మాణమవుతున్న ఈ చిత్రం కోసం రాత్రింబవళ్లు షూటింగ్ జరుగుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఈదర రవికుమార్ చెప్పారు. మాటలు: జనార్థన మహర్షి, సంగీతం: కోటి, నిర్మాతలు: ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: ఇవివి సత్యనారాయణ