Namo Venkatesa | Audio success | Venkatesh | నమో వెంకటేశా ఆడియో సక్సెస్
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా వెంకటేష్, త్రిష కాంబినేషన్లో నిర్మిస్తున్న "నమో వెకటేశ" ఆడియో సక్సెస్ సందర్భంగా సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. వినూత్నంగా ఈ కార్యక్రమం గంటపాటు నిర్వహించారు.
ముందుగా రామానాయుడు మాట్లాడుతూ, ఈ సినిమా పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చిందన్నారు. డి. సురేష్ బాబు మాట్లాడుతూ... సెన్సార్ పూర్తయింది. ఈనెల 14న చిత్రం విడుదల కానుంది. నిర్మాతలు కొత్తవారైనా బాగా తీశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా ఉంది. అందుకే ఆడియో సక్సెస్ జరుపుతున్నాం అన్నారు.
శ్రీను వైట్ల మాట్లాడుతూ... ఈ చిత్ర నిర్మాతలు నా స్నేహితులు. సినిమా తీయాలనే చిరకాల కోరిక ఈ సినిమాతో నెరవేరింది. దీనికి కారకులైన సురేష్ బాబు, వెంకటేష్‌కు అభినందనలు. గోపీ మోహన్ ఇచ్చిన కథ వెంకటేష్‌కు బాగా సరిపోయింది. ఆ తర్వాత ఏడాదిపాటు ఈ కథ గురించి చెబుతూనే ఉన్నాడు. కాస్త అటూ ఇటూ మార్పులు చేసి తీశాము. దేవీశ్రీప్రసాద్ ఆడియోకు పెండ్లికొడుకైతే పెండ్లి కూతురు పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి. మంచి సాహిత్యాన్ని రాశాడు అన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ... ధర్మాన్ని పాటించే వ్యక్తి దాని ఆధారంగా గెలుపు ఎలా సాధించాడు అనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తమని దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు అర్థమయింది. శ్రీను వైట్ల సోదరుడు లాంటివాడు. ఢీ సినిమా నుంచి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో ఆరు పాటలు రాశాను. సంక్రాంతినాడు విడుదలకావడం ఆనందంగా ఉంది అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ... ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎప్పటినుంచో చేయాలనుకున్నాం. ఈ సినిమా పాజిటివ్ అనేది అందరిలో ఉండాలి. అలాగే పాజిటివ్ దృక్పథంతో ఈ సినిమా చేశాం. ఎదుటివారిలో చెడును చూడకుండా మంచి గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా ఉన్నప్పుడే మనలోని దేవుడు బయటకు వస్తాడు. అలాంటి కథే ఈ సినిమా అని చెప్పారు.