1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Simha

Balakrishna | Simha | Shooting in progress | Nayanatara | నయనతార- స్నేహా ఉల్లాల్- నమితలతో "సింహా"

బాలకృష్ణ
WD
సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలతో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ మళ్లీ "సింహా"తో మరోసారి తన సత్తా చూపించనున్నాడు. బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న "సింహా" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రం గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బాలయ్య ఆంగికం, అభినయం అన్నీ కొత్తగా ఉంటాయి. బాలకృష్ణ సరసన నయనతార నటించడం చిత్రానికి ఓ హైలెట్ అవుతుంది. నయనతార తప్ప ఆ పాత్రకు మరెవరూ సూట్ కారు. నయనతారతోపాటు స్నేహా ఉల్లాల్, నమిత నటిస్తున్నారు.

నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ... మా బ్యానర్లో ఇది చాలా కాస్ట్‌లీ సినిమా. పవర్‌ఫుల్ సినిమాగా ప్రేక్షకులముందుకు తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. బాలయ్య కెరీర్లో ఇది ఒక సన్సేషనల్ ఫిలిమ్ అవుతుందని అన్నారు.

యువరత్న బాలకృష్ణ, నయనతార, స్నేహా ఉల్లాల్, నమితలతోపాటు కిన్నెర, ఝాన్సీ, కోట, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, హేమంత్, శ్రావణ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: బోయిపాటి శ్రీను.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT