రవితేజ హీరోగా "కిక్" నిర్మాత వెంకట్ చిత్రం
WD
ఈ సందర్భంగా కిక్ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. "కిక్ వంటి సెన్సేషనల్ మూవీ తర్వాత మళ్లీ క్రేజీ స్టార్ రవితేజగారితో ఈ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. "కృష్ణ"వంటి సూపర్ హిట్ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించిన త్రిష మరోసారి ఈ చిత్రంలో రవితేజ సరసన నటిస్తోంది. మగధీర వంటి బ్లాక్‌బస్టర్ మూవీలో ప్రత్యేక పాత్ర పోషించిన రియల్‌స్టార్ డాక్టర్ శ్రీహరి ఈ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రను చేయడం విశేషం.
ఈ చిత్రం ద్వారా గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు" అన్నారు. క్రేజీస్టార్ రవితేజ, త్రిష, రియల్ స్టార్ శ్రీహరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను అతిత్వరలో తెలియజేస్తామని నిర్మాత వెంకట్ చెప్పారు.
