1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. ఫిబ్రవరి మొదటివారంలో జింగానియా "తేజం"

ఫిబ్రవరి మొదటివారంలో జింగానియా "తేజం"

తేజం
బలరాం సమర్పణలో సన్‌రేస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తొమ్మిదిమంది హీరోలను పరిచయం చేస్తూ, రాజ్ కెఎస్ గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న తేజం ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ... తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. మంచి టెక్నికల్ వ్యాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం యువత మనోభావాలకు, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. ప్రీతి జింగానియా స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ఒక హైలెట్ కాగా ఛేజింగ్, బ్రహ్మానందం కామెడీ మరో హైలెట్‌గా నిలువనున్నాయి అన్నారు.

నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ... ఇప్పటికే ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన లభించింది. పాటలు వినడానికి ఎంత బాగున్నాయో, చిత్రీకరణ కూడా అంతకు తక్కువ కాకుండా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి ఆదరణ ఉంది. క్లీన్ యు సర్టిఫికేట్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుంచి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మీద చిత్రాన్ని నిర్మించారన్న ప్రశంసలు అందుకొన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

సర్దార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, దిలీప్, గౌతమ్, ప్రీతి జింగానియా తదితరులు నటించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి