ఫిబ్రవరి 12న యువసామ్రాట్ నాగార్జున "కేడీ"
కింగ్ నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళా మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం "కేడి" నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... నాగార్జునగారితో మా బ్యానర్లో తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడి. ఈమధ్యనే రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న కేడీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా బ్యానర్లో మరో హిట్ చిత్రంగా కేడీ నిలుస్తుందని అన్నారు.
కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ముఖ్యపాత్ర చేస్తున్న కేడీ చిత్రంలో "స్లమ్ డాగ్ మిలయనీర్" ఫేం అంకుర్, "బాండిట్ క్వీన్" ఫేం నిర్మల్ పాండే, "లగాన్" ఫేం అఖిలేంద్ర మిశ్రా, "డాన్" విలన్ కెల్లీడార్జ్, షాయాజి షిండే, బ్రహ్మానందం, హర్షవర్థన్, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రలు పోషించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, ఫోటోగ్రఫీ: సర్వేష్ మురారి, లిరిక్స్: చిన్నిచరణ్, కృష్ణ చైతన్య, ఫైట్స్: సెల్వ, ఎడిటింగ్: శ్రవణ్, ఆర్ట్: శ్రీకాంత్, మూర్తి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం

