1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Charmi

Indu | Charmi | Lady Oriented film | Manorama | Mantra | "ఇందు"గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఛార్మి!

ఇందు
గ్లామర్, లేడిఓరియెంటెడ్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ ఛార్మి త్వరలో "ఇందు"గా వస్తోంది. మనోరమ, మంత్ర వంటి హిట్ సినిమాల తరహాలో "ఇందు" కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 

పబ్లిసిటీ రంగంలో 9 సంవత్సరాల అనుభవంగల బిబిఎస్ స్టూడియో తొలిసారిగా తమిళ చిత్రాన్ని తెలుగులో "ఇందు"గా అనువదించింది. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో మురారిశెట్టి లక్ష్మణ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సరికొత్త కథ, కథనాలతో పాటు ఆదర్శవంతమైన కథాంశాన్ని తీసుకుని దర్శకుడు తెరకెక్కించారన్నారు. అభిమానంతో ఆడపిల్లలను కాలేజీకి పంపాలే తప్ప, అనుమానంతో కాదని చెప్పే సందేశం ఈ చిత్రంలో ఉందని నిర్మాత చెప్పారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, చక్రి, ఘంటాడికృష్ణ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చక్రి మాట్లాడుతూ.. దర్శకుడయ్యే లక్షణాలు నిర్మాత బాబీలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆయన తనకు చాలా రోజులుగా తెలుసునని, ప్రస్తుతం ఆర్టిస్టు అవుతాడేమోనని అనుమానం కూడా తనలో ఉందని వెల్లడించారు. త్వరలో ప్రత్యక్షంగా ఓ సినిమా తీయాలని చక్రి ఆశించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బి. జయ మాట్లాడుతూ.. లేడి ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
About Writer
SELVI.M