Actor Venkatesh | Namo Venkatesa | Trisha | లడ్డూలు తినిపించిన విక్టరీ వెంకటేష్
WD
వెంకటేష్ అందరి టాలెంట్‌ను ప్రశంసిస్తూ.. వారి దగ్గరికి వెళ్లి లడ్డూలు, అరిసెలు తినిపించారు. చిత్ర విజయం అందరి సమిష్టి కృషి అనీ, సంక్రాంతి చిత్రాల్లో అన్నీ హిట్ అయ్యాయనీ, వాటిలో నా చిత్రం కూడా ఉండటం ఆనందంగా ఉందని అన్నారు
దర్శకుడు మాట్లాడుతూ... గత డిసెంబర్‌లో ఈ సినిమాను చేద్దామనుకున్నప్పుడు గోపీమోహన్ చెప్పిన లైన్ ఎంతగానో నచ్చింది. అనుకున్నట్లుగానే చిత్రం హిట్ అయింది. వెంకటేష్‌తో మరో సినిమా చేయాలనే కోరిక కలిగింది. తప్పకుండా చేస్తాను. టెక్నీషియన్స్ బలంతో ఈ చిత్రం సక్సెస్ అయిందన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ... వెంకటేష్‌తో చాలా సినిమాలు చేశాను. ఆయనలో మంచి కమేడియన్ ఉన్నాడు. భగవంతుడు అనుగ్రహంతో పెద్ద కాస్టింగ్‌తో హిట్ అయిందని అన్నారు. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్, అనిల్ మాట్లాడుతూ.. శ్రీను వైట్ల మా ఫ్రెండ్. సినిమా చేయమని అడిగితే టైమ్ వచ్చినప్పుడు చేస్తానన్నాడు. అలాగే టైమ్ వచ్చి మంచి చిత్రం తీశాం అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.