Jagapathi Babu | Priyamani | Sadhyam | Audio | జగపతిబాబు ఎప్పటికీ 25 ఏళ్ల యువకుడే..!: శ్రీధర్
జగపతిబాబును ఎప్పుడు చూసినా ఇంకా 25 సంవత్సరాల యువకుడిగా కన్పిస్తాడని నిర్మాత శ్రీధర్ ప్రశంసించారు. జగపతిబాబు, ప్రియమణి జంటగా నటిస్తోన్న "సాధ్యం" సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ.. "మిగతా హీరోలకు ఎంతగా కాస్మోటిక్ టెక్నాలజీ వాడినా ముఖంలో ఆ కళ తెలిసిపోతుంది. కానీ జగపతిబాబు మాత్రం అలాంటి కాస్మోటిక్స్‌ను ఏ మాత్రం వాడడనే విషయం నాకు తెలుసు. అందుకే ఆయన చిత్రాలంటే అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడుతుంటారు" అని శ్రీధర్ చెప్పుకొచ్చారు. దీంతో పక్కనే ఉన్న ప్రియమణి.. అందుకుని మీరిలా కితాబిస్తే రేపు టీనేజ్ అమ్మాయి తన సరసన హీరోయిన్‌గా కావాలంటాడని సరసమాడింది.
ఈ కార్యక్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ.. "సాధ్యం" ఆడియో విడుదల ఫంక్షన్‌కు చాలా డల్‌గా వచ్చాను. వేరే కారణాల వల్ల నా మైండ్ సరిగ్గా లేదు. ఆడియో ఫంక్షన్ అంటే పెద్దగా ఎవరూ రారనుకున్నా. కానీ సాధ్యం ఆడియోకు హాలంతా నిండిపోవడం, పోస్టర్లు ఆకట్టుకునేలా ఉండడం, ఇంతమంది సరదాగా మాట్లాడటం చూసి ఒక్కసారిగా నాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇదంతా చూస్తుంటే.. సాధ్యం సినిమా తప్పకుండా విజయవంతమవుతుంది" అని జగపతిబాబు చెప్పారు.
