Priyamani | Jagapathi Babu | Ladu Bond Girl | Lagadapati Sridhar | Sadhyam | ప్రియమణి.. లేడీజేమ్స్‌బాండ్..!: లగడపాటి శ్రీధర్
File
FILEతాజాగా ప్రియమణి "సాధ్యం" చిత్రంలో జగపతిబాబు సరసన నటిస్తోంది. "పెళ్లయిన కొత్తలో" చిత్రానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసముందని లగడపాటి శ్రీధర్ అన్నారు. ఇంకా సాధ్యం పబ్లిసిటీ స్టిల్స్ చూస్తుంటే.. ఆమె బాండ్‌గాళ్‌గా పనికివస్తుందని లగడపాటి శ్రీధర్ కితాబిచ్చారు.
ఇదే అభిప్రాయాన్ని పక్కనే ఉన్న జగపతిబాబు వ్యక్తం చేస్తూ.. "నేనెప్పుడో చెప్పానుగా. ప్రియమణిలో ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. పాపం అవన్నీ లగడపాటికి తెలియవు. కానీ లగడపాటి తదుపరి సినిమాలో నువ్వే బాండ్ గాళ్‌వి. మరి నా గురించి ఆలోచించకేం.. (ప్రియమణిని ఉద్దేశించి)" అంటూ జగపతిబాబు సెటైర్ వేశారు.
జగపతిబాబు సెటైర్‌తో తను చెప్పాలనుకున్నది చెప్పకుండానే కూర్చున్న ప్రియమణి.. మళ్లీ తనే నిలుచుకుని మాట్లాడటం మొదలు పెట్టింది. మళ్లీ జగపతిబాబు ఏదో అనడంతో.. "ఇక నేనేం మాట్లాడను. గొడవలుచేసేవారిని ఎందుకు రానిస్తారంటూ.." ఆమె తిరిగి సెటైర్ విసిరింది.
దీంతో కూల్..కూల్.. బి. పాజిటివ్ అంటూ జగపతిబాబు అనడంతో మళ్లీ ప్రియమణి మాట్లాడటం ఆరంభించింది. "సాధ్యం కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. డేట్స్ కాదనకుండా ఇచ్చాను. కథ బాగా నచ్చింది. జగపతిబాబు షూటింగ్‌లో ఎంత గొడవచేసినా సినిమా అనుకున్న టైమ్‌లో పూర్తయింది" అంటూ ముగించింది. ఇంకా సాధ్యం ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులంతా ప్రియమణిని ప్రశంసలతో ముంచెత్తారు.