1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. ఉషాకిరణ్ మూవీస్ "బెట్టింగ్ బంగార్రాజు"

Ushakiran Movies, Bangarraju, Naresh, Nidhi | ఉషాకిరణ్ మూవీస్ "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్
సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తమ 84వ చిత్రంగా పూర్తి వినోదాత్మకంగా "బెట్టింగ్ బంగార్రాజు" తెరకెక్కిస్తోంది. వినోదభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఎదుగుతున్న కథానాయకుడు నరేష్ ఈ చిత్ర హీరో అయితే, ఇ. సత్తిబాబు దర్శకుడు. ఈ చిత్రం ద్వారా నిధి తెలుగుతెరకు నాయికగా పరిచయమవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.

చిత్రం గురించి సత్తిబాబు మాట్లాడుతూ- నరేష్ సినిమా అనగానే వినోద ప్రధానం అని సగటు సినిమా ప్రేక్షకుడు సిద్ధమైపోతున్న తరుణం ఇది. అందుకే ఈ చిత్రాన్ని రెండున్నర గంటలపాటు వినోదంగా ఉండేలా కథానుగుణంగా చిత్రీకరించడం జరిగింది. ఓ పల్లెటూరిలో బాధ్యతారహితంగా తిరుగుతూ, బెట్టింగ్‌లు కాస్తూ జీవితాన్ని గడిపే బంగర్రాజు జీవితం, నాయిక నిధి పరిచయంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్న అంశాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారమని చెప్పారు.

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర చిత్రంలోని గీతాలను సమకూర్చారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పలు సుందరమైన ప్రదేశాలలోనూ, రామోజీ ఫిలిమ్ సిటీలోనూ వీటిని చిత్రీకరించడం జరిగింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT