Gang War | Kick Syam | Samudra | వచ్చే నెలలో "కిక్" శ్యామ్ "గ్యాంగ్ వార్"
కిక్ ఫేమ్ శ్యామ్ హీరోగా తమిళంలో రూపొందిన అగంపురం చిత్రాన్ని తెలుగులో "గ్యాంగ్ వార్"గా టి. క్రియేషన్స్ అనువదిస్తోంది. దీనికి దర్శక నిర్మాత తిరుమలై. "గ్యాంగ్ వార్" ఆడియో శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో శ్యామ్‌కు అందజేశారు. సముద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఇందులో శ్యామ్ డ్యూయల్ రోల్ చేసినట్లుగా ఉంది. బాగా చేశాడు. రెండు కిక్‌లు ఇస్తాడని భావిస్తున్నానని చెప్పారు.
శ్యామ్ మాట్లాడుతూ... తనను నమ్ముకున్న వారికోసం డబ్బు సంపాదించడానికి ఏదైనా చేసే యువకుని గాథే ఈ సినిమా. కిక్ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమా తయారైంది. అప్పుడే దర్శకుడు దీన్ని తెలుగులో చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి మనిషిలో వార్ అనేది ఎక్కడో ఒకచోట జరుగుతుంటుంది. అదే ఈ చిత్ర కథాంశం. వచ్చే నెలలో విడుదల చేయనున్నాం. ఈ చిత్రం షూటింగ్ సింగపూర్, మలేషియాల్లో చేశాం. సుందర్ సి.బాబు చక్కని సంగీతం చేశారు. హీరో రవితేజ ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేశారని అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ... మంచి కథాంశంతో వచ్చిన ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకముంది. తమిళంలో ఆయన చేసిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అని చెప్పారు. ఈ చిత్రం విజయవంతం చేస్తారని దర్శకుడు తెలుగు ప్రేక్షకులను కోరారు. మధు ఎంటర్‌టైన్మెంట్ ద్వారా ఆడియో విడుదలైంది.
