Jr NTR | Adurs | Hyderabad | Platinum disk | ప్రేక్షకులు నా రెండేళ్ల ఆకలి తీర్చారు: జూనియర్ ఎన్టీఆర్
రెండేళ్లుగా హిట్ ఆకలితో నకనకలాడుతున్న తనకు ఒక్క "హిట్"తో ప్రేక్షకులు కడుపు నింపేశారని జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ప్లాటినం డిస్క్ కార్యక్రమం సందర్భంగా అన్నాడు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శనివారం రాత్రి ఓడియన్ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీప్రముఖులు విచ్చేశారు.
ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత తను సినిమాలకు పనికిరానని చాలా మంది అన్నారనీ, డ్యాన్సులు చేయలేడని చెప్పారని గుర్తు చేసుకున్నాడు. అయితే అభిమానుల ఆశీస్సులతో తను తిరిగి పూర్వ శక్తిని సంతరించుకోగలిగానన్నాడు.
