1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Akkineni Award

Latamangeshkar |Akkineni Award | T.Subbarami Reddy | లతా మంగేష్కర్‌కు అక్కినేని అవార్డు

లతామంగేష్కర్
WD
ఐదవ అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అవార్డును ఈ ఏడాదికి గాను ప్రముఖ గాయని లతామంగేష్కర్‌కు ఇవ్వనున్నారు. ఫౌండేషన్ ఛైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

విలేకరులతో మాట్లాడుతూ ఆయన... "ఇప్పటికే ఆమెకు ఈ అవార్డు ఇవ్వాల్సి ఉండగా అనారోగ్యరీత్యా ఆమె బయటకు రాకపోవడంతో అప్పుడు ఇవ్వలేకపోయాం. ఈసారి కూడా ఈనెల 31న ఆమె తిరుపతి వస్తున్నారు. అటునుంచి హైదరాబాద్ వచ్చి తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. అందుకే ఫిబ్రవరి 1న ఆమెకు అవార్డులు ప్రదానం చేయనున్నామ"ని చెప్పారు.

ప్రతి రంగంలోని వారికి ఈ అవార్డు ఇవ్వాలన్నది తమ ఉద్దేశ్యమని అక్కినేని చెప్పారు. అవార్డు కమిటీ ఛైర్మన్ టి.సుబ్బరామిరెడ్డి, కమిటీ సభ్యులుగా డాక్టర్ డి. రామానాయుడు, బోనీకపూర్ ఉన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT