1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Birth day

Actor Raviteja | Birth day | January 26 | Don Seenu | చెప్పటానికేముంది... మీరే ఏదో ఒకటి రాసుకోండి: రవితేజ

రవితేజ
WD
రేపు... అంటే జనవరి 26వ తేదీ విలక్షణ హీరో రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనను ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే... నా గురించి ఇంకా చెప్పేదేముందండీ... ఏదో ఒకటి మీరే రాసుకోండి అని నవ్వుతూ చెప్పారు.

ఇకపోతే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో నిర్మించే చిత్రాలన్నీ అదే రోజున( జనవరి 26)షూటింగ్ మొదలెట్టేందుకు నిర్మాతలు పోటీపడ్డారు. ఈ క్రమంలో రవితేజ "డాన్ శీను" ప్రారంభమైంది. ఈ చిత్రంలో డాన్ శీనుగా రవితేజ నటిస్తున్నారు.

ఈ చిత్రం సోమవారంనాడు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రవితేజ, శ్రీహరిలపై తొలి సన్నివేశం తీశారు. జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, డి. రామానాయుడు కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు.

రవితేజ మాట్లాడుతూ... "కిక్ తర్వాత వెంకట్ నిర్మాతగా చేస్తున్న రెండవ సినిమా ఇది. నా కెరీర్‌లో బెస్ట్ నిర్మాత ఆయన. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం సాగుతుంద"ని అన్నారు.

రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ... "నాకు రవితేజ అంటే చాలా ఇష్టం. రవితేజతో 8వ సినిమా చేస్తున్నా. అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే నాయకుడు ఆయన. నేను రాసిన "ఢీ" హిట్టయింది. అంతకుమించిన హిట్ చిత్రంగా ఇది నిలుస్తుంద"ని అన్నారు.

ఈ చిత్రంలో శ్రీహరి మరో విభిన్న పాత్రను పోషిస్తున్నారు. మరో పాత్రను బ్రహ్మానందం పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోందని చెప్పారు. చిత్ర సమర్పకుడు అచ్చిరెడ్డి మాట్లాడుతూ.... ఆర్ఆర్ మూవీ మేకర్స్ చిత్రంలో 9వ సినిమా ఇది. గోపీచంద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ... రవితేజకు చక్కగా సరిపోయే చిత్రమిది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం అన్నారు. ఇంకా ఈ చిత్రంలో షిండే, అలీ, సునీల్, రఘుబాబు, కృష్ణ భగవాన్, నాజర్, దువ్వాసి మోహన్, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. కెమేరా: సమీర్ రెడ్డి, సంగీత: మణిశర్మ, సహనిర్మాత: వి. సురేష్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT