1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. శివరాత్రి కానుకగా వస్తున్న "జాయ్"

Joy, Avitej, Trinath, Actress Parwati, Vainavi | శివరాత్రి కానుకగా వస్తున్న "జాయ్"

జాయ్
WD
అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా... పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి కంభన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్". ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బి.రాజా మాట్లాడుతూ... "స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ హైలెట్ అవుతుంది.

హీరో, హీరోయిన్లు కొత్తవారైనప్పటికీ చాలా బాగా చేశారు. ఇటీవల విడుదలైన ఆడియో పెద్ద హిట్ అయింది. ఆడియో సాధించిన విజయం చిత్రంపై మా నమ్మకాన్ని మరింత పెంచింది. శివరాత్రి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నమ్మకం నాకు ఉంది" అని అన్నారు.

అవితేజ్, త్రినాథ్, వైనవి, పార్వతి, సునీల్, వెన్నిరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: ఆకాష్ అశోక్ కుమార్, సంగీతం: విద్యాసాగర్, పాటలు: భువనచంద్ర, సమర్పణ: ఇ.వి.కుమార్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బి. రాజా
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT