1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Panchakshari

Actress Anushka | Panchakshari | Chandra | Makeup man | నేను హీరోయిన్‌గా మేకప్‌మేన్ సినిమా తీస్తానన్నాడు

అనుష్క
WD
"నేను మొట్టమొదటి సినిమాలో నటించడంకోసంగాను మేకప్ వేసుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చాను. నాకు చంద్ర మేకప్ వేశారు. ఆయనను నేను బొమ్మి అని పిలుస్తాను. ( అసలు పేరు బొమ్మదేవర రామచంద్రరావు). చాలా మంచి వ్యక్తి. నటిగా ఎలా ఉండాలో చాలా జాగ్రత్తలు చెప్పారు. నాకు మేకప్ వేస్తూనే... నేను సినిమా తీస్తే మీరు హీరోయిన్‌గా నటిస్తారా... మేడమ్? అని అడిగారు.

నాకు నవ్వు వచ్చింది. అసలే మొదటి సినిమా. ఆ సినిమా రిజల్ట్ తర్వాత అసలు హైదరాబాదులో ఉంటానో ఉండనో కూడా నాకు తెలీదు. అటువంటి టైమ్‌లో నన్ను పెట్టి సినిమా తీయడం అనేది ఊహించలేదు. జోక్ చేస్తున్నారనుకుని... అలాగే తప్పకుండా అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.

కానీ ఇన్నాళ్లకు మేకప్‌మేన్ చంద్ర నాతోనే సినిమా తీయాలనుకోవడం.. నిజంగా థ్రిల్‌గా ఉంది. ఇంకో విషయం.. చాలామంది అరుంధతి తర్వాత అనుష్క ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అరుంథతి సినిమాకు ముందే ఈ చిత్రాన్ని చేసేదాన్ని. కానీ ఆ సమయంలో మిగిలిన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను" అని చెప్పింది అనుష్క.

అనుష్క నటిస్తోన్న ఈ చిత్రం పేరు పంచాక్షరి. దీనికి వి. సముద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున సమర్పించడం విశేషం. ఈ చిత్ర లోగోను సోమవారం రాత్రి అన్నపూర్ణలో ఆవిష్కరించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT