1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Ileana

NTR | Ileana | Aswani Dat | Adurs | Kantri | Kick | ఎన్టీఆర్, ఇలియానా జంటగా అశ్వనీదత్ కొత్త చిత్రం!

ఎన్టీఆర్
FILE
వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో "అదుర్స్" సినిమా ద్వారా బిగ్‌హిట్ కొట్టిన నందమూరి హీరో, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అశ్వనీదత్‌తో మరో బంపర్ హిట్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.

అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ, తెలివిగా సినిమా మార్కెటింగ్‌ చేసుకునే అశ్వనీదత్.. ఎన్టీఆర్‌తో కొత్త సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి "కంత్రి" దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వ పగ్గాలు చేపట్టనున్నారు.

ఈ సినిమా షూటింగ్ గురువారం గచ్చిబౌలికి సుదూరంలో ఉన్న గోల్ఫ్‌కోర్ట్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆరంభమైంది. అశ్వనీదత్-మెహర్ రమేష్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో గతంలో ఎన్టీఆర్-హన్సికలు జంటగా నటించిన "కంత్రి" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఇదే కాంబినేషన్‌లో రూపొందనున్న నూతన చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన "కిక్" సుందరి ఇలియానా నటిస్తోంది.
WD


మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ.
About Writer
SELVI.M