Junior NTR | Lakshmi Pranita | Marriage | Telugudesam | "జూనియర్" కళాశాల విద్యార్థినితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి
WD
ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీ ప్రణీత ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఓ న్యూస్ ఛానల్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె. ఈమె ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని నాసర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
కాగా జూనియర్ ఎన్టీఆర్‌తో లక్ష్మీప్రణీత వివాహాన్ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వచ్చే మే నెలలో ఓ శుభ ముహుర్తాన ఎన్టీఆర్, ప్రణీతల వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించినట్లు సమాచారం.