1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Maro charitra

Varun Sandesh | Maro charitra | Shooting | Anita | Sraddha Das | Dil Raju | వరుణ్ సందేశ్ "మరోచరిత్ర" షూటింగ్ పూర్తి!

వరుణ్ సందేశ్
WD
అలనాటి సెన్సేషనల్ హిట్ చిత్రం "మరోచరిత్ర". కమల్‌హాసన్, సరిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బాలచందర్ అద్భుతంగా రూపొందించారు. అటువంటి చిత్ర కథను ఈనాటి ట్రెండ్‌లో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో దిల్‌రాజు "మరోచరిత్ర"ను మళ్లీ నిర్మిస్తున్నారు.

పలు హిందీ చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేసిన రవియాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దిల్‌రాజు మాట్లాడుతూ.. "మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందిస్తోన్న సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు బాగా తెలుసు. కొత్తగా మా సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. "మరోచరిత్ర" లాంటి సినిమాను మళ్లీ తీయడం సాహసమే. మరోచరిత్రను అద్భుతంగా తెరకెక్కించేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నాం. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రముంటుంది. పాటలు చాలా బాగా వచ్చాయి. కానీ అలనాటి కథను కొత్తగా చూపించే ప్రయత్నం" ఇదని అన్నారు.

హీరో వరుణ్ మాట్లాడుతూ.. మిక్కీజేమేయర్ చక్కగా పాటలకు సంగీతం అందించారు. వింటుంటే ఇంకా వినాలనిపించేట్లుగా ఉన్నాయి. ప్రేమికుల రోజున ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

దర్శకుడు రవియాదవ్ మాట్లాడుతూ.. "దిల్‌రాజు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. రెండు పాత పాటలను రీమేక్ చేశాం. రచయితగా కొత్తగా అనురాధను పరిచయం చేస్తున్నాం" అని చెప్పారు.

కోటశ్రీనివాసరావు, ప్రతాప్‌పోతన్, ఊర్వశి, తలైవాసల్ విజయ్, జానకి, సుభాష్, నరేష్, ఆదర్శ్, వేణు, వెంకీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కొరియోగ్రాఫర్: రాజుఖాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జగన్మోహన్‌రెడ్డి.