Latha Mangeshkar | Akkineni Nageswara Rao | ANR Award | లతా మంగేష్కర్ నా అభిమాని: అక్కినేని
WD
అక్కినేని అవార్డు ప్రదానోత్సవంలో అక్కినేని నాగేశ్వరరావు గానకోకిలపై ప్రశంసల వర్షం కురిపించారు. గానకోకిల అయిన లతా మంగేష్కర్‌ను మన దేశం భారతరత్న పురస్కారంతో సత్కరించిందని నాగేశ్వరరావు గుర్తు చేశారు. కానీ ఈ అవార్డు లతా మంగేష్కర్ నైపుణ్యతకు ఏ మాత్రం సరిపోదని, ఆమెకు ప్రపంచ రత్న అవార్డును ప్రదానం చేసి ఉండాల్సిందని అక్కినేని పేర్కొన్నారు.
ఇంకా అక్కినేని మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆదివారం తనతో ఫోనులో మాట్లాడారని చెప్పారు. 'దేవదాసు' చిత్రాన్ని తాను చూశానని, ఇంకా తాను అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని లతా మంగేష్కర్ చెప్పడం తనలో ఎంతో సంతోషాన్ని నింపిందని అక్కినేని అన్నారు.
గొప్ప గాయనిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన లతా మంగేష్కర్ తాము అందజేసే చిన్ని అక్కినేని అవార్డును అందుకోవడంతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని అక్కినేని అన్నారు. కాగా, అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య, కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్, కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.