Brahmanandam | Birth Day | February 1 | Tollywood | బ్రహ్మ+ ఆనందం= బ్రహ్మానందం
WD
ప్రారంభ చిత్రం నుంచీ నవ్వు నవ్వుకూ తేడాలను చూపిస్తూ... నవ్వులకు పదునుపెడుతూ నవ్వు+ నవ్వు+ ... అంటూ నవ్వుకే పొట్టచెక్కలయ్యేలా నవ్వును తెప్పిస్తూ తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులకు హాస్యపు విందు చేస్తున్నారు.
అన్ని రసాలలోకెల్లా హాస్య రసాన్ని పలికించడం ఎంతో కష్టమని చెపుతారు. ఈ హాస్య రసాన్ని గుళికలు చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హాస్యరసబ్రహ్మ బ్రహ్మానందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుదాం. ఎందుకంటే ఇవ్వాళ... అదే ఫిబ్రవరి 1 ఆయన పుట్టిన రోజు.