గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » "లీడర్" కథ నాదేనంటూ ఓ యువకుడు పేచీ (Leader | Rana | Story | Sekhar Kammula)
కథనాలు
Bookmark and Share Feedback Print
 
WD
సినిమా కథలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నామంటూ హీరోలు, దర్శకులు చెబుతున్న మాటే. కానీ హిట్ అయిన తర్వాత ఆ చిత్ర కథ తనదంటూ రకరకాలుగా వార్తల్లోకి వస్తుంటారు కొందరు రచయితలు.

ప్రస్తుతం అటువంటి పేచీ లీడర్ సినిమా కథపైనా పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆనంద్, హ్యాపీడేస్ చిత్రాలను తన బ్రైన్ చైల్డ్‌గా చెప్పుకుంటారు శేఖర్ కమ్ముల. అదలా వుంచితే తాజా ఏవీఎం నిర్మిస్తోన్న లీడర్ కథ తను వైఎస్ బతికి ఉన్నప్పుడు ఎలక్షన్ల టైమ్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రాసుకున్నాననీ ప్రతి ప్రెస్ మీట్‌లోనూ చెబుతుండేవాడు.

అయితే... ఈ కథ తను రాసుకున్న లీడర్ అనే కథలోనుంచి తీసుకున్నదేననీ, తనకు నష్టపరిహారం చెల్లించాలని శివ అనే వ్యక్తి రైటర్స్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇది సమకాలీన పరిస్థితుల నేపథ్యంలోనే తను రాసుకున్నాననీ, కాపీ కొట్టే అవసరం తనకు లేదనీ అసోసియేషన్ ముందు శేఖర్ కమ్ముల స్పష్టం చేశారని తెలిసింది.

కానీ కథా చౌర్యంకింద తనకు 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని శివ పేచీ పెట్టాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. అయితే ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. మరి ఆ చిత్రం విడుదల తర్వాత రిజల్ట్ బేరీజు వేసి మళ్లీ పేచీ పెడతాడేమో చూడాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: లీడర్, రాణా, కథ, శేఖర్ కమ్ముల