1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A.R. Rahman

Naga Chaitanya | A.R. Rahman | E mayo chesave | Gautam menon | Samanta | Krishnudu | నాగచైతన్య "ఏ మాయ చేసావె" ఆడియో విడుదల!

ఏ మాయ చేసావె
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మిస్తున్న భారీ చిత్రం "ఏ మాయ చేసావె". ఈ సినిమాకు గ్రేట్ మ్యూజిక్ డైరక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఈ చిత్రం ఆడియో సోని మ్యూజిక్ ద్వారా ఫిబ్రవరి మూడో తేదీన విడుదలైంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాట్లాడుతూ.. "గౌతమ్ చెప్పిన కథ విని ఎంతో ఇన్‌స్పైర్ అయి, సంగీతం సమాకూర్చాను. లవ్‌స్టోరీస్ చాలా వచ్చినా ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది. స్టోరీలోనే మ్యూజిక్ మిక్స్ అయి ఉంటుంది. ఓ అందమైన అనుభూతిని కలిగించే మంచి సినిమా ఇది. ఇందులో చైతన్య క్యూట్‌గా ఉన్నాడు" అని అన్నారు.

ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. "ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చేసిన "ఏ మాయ చేసావె"లో నేను హీరోగా నటించడం ఎంతో ఆనందంగా వుంది. నాకెంతో ఇష్టమైన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌తో పనిచేయడం మరింత హ్యాపీగా ఉంది. "ఏ మాయ చేసావె" ఓ అందమైన లవ్‌స్టోరీ. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక టైమ్‌లో లవ్ అనే ఎమోషన్‌కు కనెక్ట్ అవడం సహజం. అందుకే ఈ చిత్రం చూస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులు మంచి అనుభూతిని పొందుతారు. నాకు బాగా నచ్చిన ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు, అభిమానులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

దర్శకులు గౌతమ్ వాసుదేవ మీనన్ మాట్లాడుతూ.. "ఎ.ఆర్. రెహమాన్ లాంటి గొప్ప టెక్నీషియన్‌తో వర్క్ చేయడం చాలా థ్రిల్‌గా ఉంది. ఆయనతో నాకు ఇది తొలి సినిమా. మళ్ళీ మళ్ళీ రెహమాన్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఈ లవ్‌స్టోరీకి రెహమాన్ తన మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. నాగచైతన్య వండర్‌ఫుల్ ఆర్టిస్టు. తాతగారికి, తండ్రిగారికి ఎంతో పేరు తెచ్చే నటుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని అందుకుంటాడు. ఇంకా ఇందిరా ప్రొడక్షన్స్ మంజుల, సంజయ్‌ళతో పనిచేయడం హ్యాపీగా ఉంది. "ఏ మాయ చేసావె" మ్యూజిక్ సెన్సేషనల్ హిట్ అయింది. సినిమా కూడా బిగ్ హిట్ అవుతుంది" అన్నారు.

మంజుల మాట్లాడుతూ.. "నాగచైతన్య, గౌతమ్ మీనన్‌ల కాంబినేషన్‌లో అద్భుతమైన లవ్‌స్టోరీగా "ఏమాయ చేసావె" రూపొందింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, గ్రామీ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ "ఏమాయ చేసావె" చిత్రానికి ఏడు అద్భుతమైన పాటల్ని ఇచ్చారు. రెహమాన్‌తో రెండో సినిమా చేసే అవకాశం రావడం చాలా గొప్పగా ఉంది. "ఏమాయ చేసావె" చిత్రం నాగచైతన్య సినీ కెరీర్‌కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. గౌతమ్ ఈ సినిమాను ఎక్స్‌ట్రార్డనరీగా తీశారు" అని వెల్లడించారు.

నిర్మాత సంజయ్ స్వరూప్ మాట్లాడుతూ.. "రెహమాన్‌లాంటి గ్రేట్ టెక్నీషియన్, గొప్ప వ్యక్తితో కలిసి వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. గౌతమ్ వండర్‌ఫుల్ టెక్నీషియన్. నాగచైతన్య భవిష్యత్తులో పెద్ద హీరో అవుతాడు. అందరికీ నచ్చే అద్భుత ప్రేమకథా చిత్రంగా "ఏమాయ చేసావె" రూపొందుతోంది. ఆడియోలాగే సినిమా కూడా సెన్సేషన్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

యువసామ్రాట్ నాగచైతన్య సరసన సమంత నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మీ, సంజయ్ స్వరూప్, సుధీర్, త్రిష అలెక్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అమెరికా, చెన్నై, కేరళ, హైదరాబాద్‌లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, పాటలు: అనంతశ్రీరామ్, మాటలు: ఉమర్జీ అనురాధ, ఫోటోగ్రఫీ: మనోజ్ పరమహంస, కళ : రాజీవన్, ఫైట్స్: సెల్వ, కాస్ట్యూమ్ల్: నళిని శ్రీరామ్, డాన్స్: ఫ్లెక్సి (లండన్), కార్ల్‌ లాన్‌షన్ (అమెరికా).

డైరకక్షన్ డిపార్ట్‌మెంట్: రేవతి, నాయుడు వంశీ, రమేష్ దేశిన, మేఘన కార్తీక్, డి.సత్య, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు, వెంకటరత్నం ఎస్., ప్రొడక్షన్ మేనేజర్స్: శివ, జేమ్స్, సమర్పణ: సూపర్‌స్టార్ కృష్ణ, నిర్మాణం: ఇందిరా ప్రొడక్షన్స్, నిర్మాత: సంజయ్ స్వరూప్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ మీనన్.
About Writer
SELVI.M