గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » కథనాలు » అక్కడ షారుక్ ఖాన్... ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ (Actor Shah Rukh Khan | Junior NTR | Karan Johar | Mumbai Police | My Name is Khan)
కథనాలు
Bookmark and Share Feedback Print
 
IFM
సుమారు నెలన్నర క్రితం జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" చిత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆంధ్ర రాష్ట్రంలో విడుదలైంది. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో "అదుర్స్" చిత్రానికి అప్పట్లో వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జోక్యంతో అది సద్దుమణిగింది. ప్రస్తుతం మరోసారి కొడాలి నాని వ్యాఖ్యలతో "అదుర్స్" చిత్రాన్ని "బెదర్" కొడుతున్నారు తెలంగాణావాదులు.

ఇటువంటి పరిస్థితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ విషయంలోనూ జరుగుతోంది. పాకిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్‌లో చోటు కల్పించి ఉండాల్సిందని పాక్ క్రికెటర్లకు అనుకూలంగా మాట్లాడిన షారుక్ ఖాన్ దేశద్రోహి అనీ, కనుక అతని సినిమా "మై నేమ్ ఈజ్ ఖాన్" చిత్రాన్ని అడ్డుకోవాలని శివసేన అధినేత బాల్ థాకరే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లో షారుక్ సినిమా విడుదల సందర్భంగా ప్రధాన థియేటర్ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి మన టాలీవుడ్‌లో ఆంధ్రా హీరోల సినిమాలు పోలీసుల బందోబస్తు మధ్య ఎలా విడుదల అవుతున్నాయో... అదేవిధంగా షారుక్ ఖాన్ చిత్రం కూడా ఫిబ్రవరి 12న విడుదల కానుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: షారుక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, కరణ్ జోహార్, ముంబయి పోలీసు, మై నేమ్ ఈజ్ ఖాన్