1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bunny

Tamannah | Bunny | Allu Arjun | Badrinath | Kick | Kollywood | Tollywood | "బన్నీ"తో నటించడం చాలా హ్యాపీగా ఉంది: తమన్నా

తమన్నా
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "హ్యాపీడేస్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల ముద్దుగుమ్మ "తమన్నా". "కాళిదాసు" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తెల్లపిల్ల తర్వాత లవ్‌బాయ్ సిద్ధార్థతో "కొంచెం-ఇష్టం కొంచెం-కష్టం"లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో చేతినిండా ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న తమన్నా.. తాజాగా బన్నీతో జతకట్టనుందని స్వయంగా చెప్పుకుంది. 

కోలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లు వస్తున్నాయని, తాజాగా బన్నీ హీరో క్రేజీ హీరో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ బద్రీనాథ్ సినిమా ద్వారా తనకు దక్కిందని చెప్పింది. ఆర్య సినిమాలో ఆయన నటన చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాయని, అర్జున్ సరసన నటించడం చాలా సంతోషంగా ఉందని ఈ హ్యాపీడేస్ మధుబాల చెప్పుకొచ్చింది.

చిలిపి నటన, డాన్స్‌, గ్లామర్‌లో ఇట్టే అభిమానులను ఆకట్టుకునే ఈ సుందరి తాజాగా క్రేజీ హీరో, అల్లు అర్జున్ హీరోగో నటించే బద్రీనాథ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా కోలీవుడ్‌‌లో 'కిక్' సినిమా రీమేక్‌లో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు.. అల్లు అర్జున్ తమన్నా కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న "బద్రీనాథ్" సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని సినీ జనం జోస్యం చెబుతున్నారు.
About Writer
SELVI.M