Yung India | ఫైనల్లో యంగ్ ఇండియా
దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న "యంగ్ ఇండియా" చివరి షెడ్యూల్ లోనికి ప్రవేశించింది. ఇందులో 81మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నట్లు దాసరి వెల్లడించారు. దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... సంచలనాత్మక కథ. అంతా తెలుగువారినే పరిచయం చేస్తున్నాం. కథకు సరియైన టైటిల్. ఈ చిత్రం చలనచిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే నమ్మకముంది. రామోజీ ఫిలిమ్ సిటీలో 85శాతం షూటింగ్ జరుపుకుంది.
ఈనెల 22 వరకూ చివరి షెడ్యూల్ ఉంటుంది. కీరవాణి చక్కని పాటలకు ట్యూన్స్ ఇచ్చారు. వేసవిలో చిత్రం విడుదల చేయనున్నాం. ఈ చిత్రం ఆడియో విడుదల చేసే రోజు నటీనటులను పరిచయం చేస్తామని తెలిపారు