Shah Rukh Khan | My Name Is Khan | Shiv Sena | Khar | మై నేమ్ ఈజ్ ఖాన్ "పులి"- శివసేన "పిల్లి"
IFM
మహారాష్ట్రలోని అన్ని థియేటర్లలో షారుక్ చిత్రం "మై నేమ్ ఈజ్ ఖాన్"ను ప్రేక్షకులు ఎగబడి చూశారు. దీంతో చిత్ర దర్శకనిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దశలో కోపం పట్టలేని కొందరు సేన కార్యకర్తలు షారుక్ కార్యాలయంపై దాడికి దిగారు. సోడా బాటిళ్లు, రాళ్లను భవనంపైకి విసిరారు. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు.
మార్నింగ్ షో సమయంలో ముంబయి, అహ్మదాబాదులలో కొన్ని థియేటర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనబడటంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుజాగ్రత్త చర్యగా కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో చిత్ర ప్రదర్శనకు పెద్ద అడ్డంకులు ఎదురు కాలేదు. దీంతో మధ్యాహ్నం నుంచి థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడాయి.
ఇదిలావుంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మహారాష్ట్రలో పరిస్థితిని అడిగి తెలుసుకుంది. పోలీసుల పనితీరును మెచ్చుకున్నది.