1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Glamour

Joy | Glamour | Karishma Kothak | విడుదలకు సిద్ధమవుతున్న జాయ్, గ్లామర్

గ్లామర్
అవితేజ్, త్రినాథ్, పార్వతి, వైనవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం జాయ్. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 20న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు బి.రాజా తెలియజేశారు. స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని దర్శకుడు చెపుతున్నారు.

శంకర్ దాదా ఫేమ్ కరిష్మాకొటక్ ప్రధాన పాత్రధారిగా పి. సత్యారెడ్డి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్లామర్. ఇందులో పి. సత్యారెడ్డి ప్రత్యేక పాత్రను పోషించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా సినిమా రంగంపై సరైన అవగాహన లేకుండా వచ్చేవారికి ఈ చిత్రం డిక్షనరీగా ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని చిత్ర సమర్పకుడు ఎస్ఎన్ రెడ్డి వ్యక్తం చేశారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT