1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Grammy

AR Rahman | Grammy | Oscar Awards | Tamilnadu | Chennai | తొమ్మిది మంది గాయకులు పాల్గొనే రెహ్మానియా

రెహ్మానియా
ఆస్కార్, గ్రామీ అవార్డుల గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్‌కు భారీ సన్మానం జరుగనుంది. ఆయన స్థాపించిన ఏఆర్.రెహ్మాన్ ఫౌండే‌షన్‌కు నిధుల సేకరణ నిమిత్తం సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఇందులో తొమ్మిది మంది గాయనీ గాయకులు కలిసి రెహ్మానియా అనే సంగీత కచ్చేరి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెహ్మాన్‌ను కూడా సన్మానిస్తారు.

స్పాస్టిక్ సొసైటీ, రాసా, స్మైల్, వి ఎక్సెల్ ఎడ్యుకేషనల్ ట్రస్టు, తమిళనాడు డిసాబెల్డ్ సొసైటీ తదితర సంస్థలకు రెహ్మాన్ ఫౌండేషన్ తన వంతు సాయం చేస్తోంది. ప్రస్తుతం ఈ పౌండేషన్‌కు నిధుల సేకరణ నిమిత్తం దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సోనూ నిగమ్, ఎస్పీబీ, శంకర్ మహాదేవన్, హరిహరన్, జగ్జీత్ సింగ్‌తో పాటు.. అనేక గాయనీ గాయకులు పాల్గొంటారు.

ఏఆర్.రెహ్మాన్ పౌండేషన్ సంస్థకు నిధుల సేకరణ నిమిత్తం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ సమాజానికి పలు రకాల సేవలు అందిస్తున్న విషయం తెల్సిందే. అలాగే, ఆస్కార్, గ్రామీ అవార్డులను కైవసం చేసుకున్నందుకు గుర్తుగా ఈ సంగీత విభావరిని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రైవేట్ సెల్యూలార్ సంస్థ యూనినార్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. డోనర్ పాస్‌లుగా రూ.100 నుంచి రూ.ఐదు వేల వరకు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసం షరన్ ఇన్ కార్పొరేషన్ 094444 14148 లేదా 3221 91111 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
About Writer
PNR