1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Dasari Narayana Rao

Young India | Dasari Narayana Rao | Dance Director | నృత్య దర్శకుడుగా దర్శకరత్న డాక్టర్ దాసరి

యంగ్ ఇండియా
కథా రచయితగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన డాక్టర్ దాసరి నారాయణరావు స్క్రీన్ ప్లే రచయితగా, గీత రచయితగా, సంభాషణల రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి సినిమా పరిశ్రమలోని అందరివాడయ్యారు.

ఎన్నో ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ అందరి అభినందనలు అందుకున్నారు. నాడు అంతా కొత్త వారితో "స్వర్గం నరకం" చిత్రం చేసి ఎందరినో పరిచయం చేసిన ఆయన ఇప్పుడు మళ్లీ 81మంది అంతా కొత్తవారిని పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా'ను రూపొందిస్తున్నారు.

ఎందరో నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా పరిచయం చేసిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఇప్పుడు నృత్యదర్శకుడుగా యంగ్ ఇండియాకి తానే స్టెప్స్ వేస్తూ మనముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలోని పాటలకు ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందించగా డాక్టర్ దాసరి నారాయణరావు ఆ పాటలను అద్భుతమైన రీతిలో మొట్టమొదటిసారిగా తాను నృత్య దర్శకత్వం వహిస్తూ మలుస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT