1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Srikanth

Ranga the Donga | Srikanth | Vimala Raman | "రంగ ది దొంగ" షూటింగ్ ప్రారంభం

రంగ ది దొంగ
WD
శ్రీకాంత్ హీరోగా జీవి దర్శకుడిగా గోల్డెన్ లైన్ ఫిలిమ్స్ అండ్ గాడ్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "రంగ ది దొంగ" సినిమా రామానాయుడు స్టూడియోలో శుక్రవారం ప్రారంభమైంది. ఓపెనింగ్ షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టగా, రామానాయుడు స్విచాన్ చేశారు. బి.గోపాల్ దర్శకత్వం వహించారు.

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ... "ఈ సినిమా కథను రెండేళ్ల క్రితం జీవీ చెప్పారు. ఇందులో నాది మాస్ ఎంటర్ టైన్మెంట్ క్యారెక్టర్. జీవీ నటుడు అయినప్పటికీ ఆయనలో మంచి ప్రతిభ ఉంది. 'మహాత్మ' చిత్రం తర్వాత మనోహర్ మళ్లీ నాతో సినిమా తీస్తున్నారని చెప్పారు. మనోహర్ మాట్లాడుతూ, శ్రీకాంత్‌తో రెండవ సినిమా. ఈ చిత్ర కథ శ్రీకాంత్ ఇంట్లో నాకు జీవీగారు వినిపించారు. దర్శకుడిగా ఆయన తనను తాను నిరూపించుకుంటాడనే నమ్మకముందని చెప్పారు.

జీవీ మాట్లాడుతూ.. "ఈ సినిమా ద్వారా కొత్త టెక్నీషియన్స్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ టైటిల్ విని ఎవరినో కించపరిచారని అనుకుంటున్నారు. కథకు ఈ టైటిల్ అవసరం కాబట్టి పెట్టాము. ఆ పేరు గల ఆయన అంటే నాకు కూడా ఎనలేని అభిమానం కాబట్టి అలాంటి లేనిపోని అపోహలు పెట్టుకోవద్దు.

దొంగగా నటిస్తున్న శ్రీకాంత్ సరసన విమలా రామన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 28 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఆగస్టులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం తదితరులు నటిస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT