Actor Padbanabham | Chennai | February 20 | "మాయా ప్రపంచం" నుంచి నిష్క్రమించిన పద్మనాభం
"మాయాప్రపంచం"తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన పద్మనాభం శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు వంటి మేటి హాస్య నటుల మధ్య తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన పద్మనాభం ఇకలేరు. 1931 ఆగస్టులో జన్మించిన ఆయన 2010, ఫిబ్రవరి 20న పరమపదించారు.
చిన్నతనంలోనే మిమిక్రీలు చేస్తూ పలువురిని అనుకరించేవారు. నాటకాలపై ఆసక్తితో ఎలాగైనా సినిమాల్లో నటించాలని కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు ఓ రోజు మద్రాస్ రైలెక్కారు. రెండురోజుల్లో డబ్బులు అయిపోయాయి. అప్పట్లో సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చేవారికి చిత్తూరు నాగయ్య తన రేణుక సంస్థలో భోజనాలు ఏర్పాటు చేసేవారు. గత్యంతరం లేక రెండుసార్లు అక్కడ భోజనం తినాల్సి వచ్చింది. పరిస్థితి చూసిన కన్నాంబ అవకాశాలు కల్పించారు.
1943లో మాయాలోకం ఆయన నటించిన తొలి సినిమా. అక్కినేని తదితరులు నటించిన ఈ సినిమాలో పద్మనాభం అక్కినేని సోదరునిగా నటించారు. కానీ పేరు రాలేదు. విజయా వారితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆయన జీవితం మారిపోయింది. తరువాత షావుకారులో నటించారు. అదికూడా పెద్ద విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన పాతాళభైరవి ఆయన కెరీర్ ను మార్చేసింది.
విజయావారి కాంట్రాక్ట్ పూర్తయ్యాక పలు చిత్రాల్లో నటించారు. రేలంగి మేనల్లుడిగా, కొడుకుగా నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోకి స్నేహితుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. 1964లో రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీరామకథ చిత్రాలను అందించారు.
వీటన్నిటికీ ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకులు. శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను గాయకునిగా పరిచయం చేసిన ఘనత పద్మనాభానిదే. పద్మనాభం నటించిన చివరి చిత్రం టాటా బిర్లా మధ్యలో లైలా. తర్వాత పలు సీరియల్స్‌లో నటిస్తూ చెన్నైలోనే ఉండిపోయారు. ఆయన బావమరిది మురళి హైదరాబాదులో ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం జరుగనున్నాయి.