1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mafia

Tollywood | Mafia | Actors | Actress | Tarun | Aarti Agarwal | Charmi | టాలీవుడ్‌ స్టార్స్ మధ్య నాట్యం చేస్తున్న "మాఫియా"

టాలీవుడ్
WD

టాలీవుడ్ వెండితెర మహారాణీ... నీ పయనమెటు...?

గత కొన్నేళ్ళుగా ఇండిస్ట్రీలో మాఫియా ఉందని వార్తలు వస్తున్నా.. అవేవీ లేవని.. సినీ పెద్దలు కొట్టిపారేస్తూ వచ్చారు. బాలకృష్ణ ఇంటివద్ద బెల్లంకొండ సురేష్‌‌పై హత్యాయత్నం, ఆ తర్వాత కొంతమంది ఫైనాన్సియర్లు నిర్మాతల్ని బెదిరించడం వంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత పబ్‌ కల్చర్‌ ఎక్కువై... సినీ నటీమణులు పబ్‌ల్లో కాలక్షేపం చేయడం ఎక్కువైంది.

ముమైత్‌ఖాన్‌, ఆర్తీ అగర్వాల్‌తోపాటు తరుణ్‌, రవితేజ సోదరుడు రఘు వంటివారెందరో ఈ పబ్‌లకు హాజరయ్యేవారు. లేటెస్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ప్రకారం ఈ పబ్‌లే డ్రగ్‌ మాఫియా కేంద్రాలుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సినీ నటుడు తరుణ్‌ మరొకరితో కలిసి అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఓ పబ్‌ను నిర్వహిస్తున్నారు. ఖరీదైన మందులతోపాటు ఆటపాటకు సెపరేట్‌ రూమ్స్‌కూడా ఉన్నాయి.

తాజాగా మత్తుమందులతో పట్టుపడ్డ దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వర్రావు అరెస్ట్‌తో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కొమ్మినేని వెంకటేశ్వరరావు గతంలో చిన్న చిత్రాలకు ఫైనాన్స్‌ ఇస్తుండేవారు. ఆ తర్వాత సడెన్‌గా ఏడేళ్ళుపాటు దుబాయికి వెళ్ళిపోయారు. అక్కడనుంచి రాగానే దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ సినిమా తీశారు. ఇంత షడెన్‌గా ఎలా నిర్మాతయ్యారు..? అనేది అప్పట్లో మీడియాలోనే చర్చనీయాంశమైంది.

దానికి ఆయన దుబాయిలో తాను డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకొచ్చేవారు. ఇన్నాళ్ళకు మీడియాకొచ్చిన అనుమానం నిజమైందని రుజువైంది. మరోవైపు.. వెంకటేశ్వరరావు భార్యమణికూడా పెద్ద నేరస్తురాలు. కొద్దికాలం క్రితమే దొంగనోట్లతో ఆమె పట్టుబడింది. ఇటీవలే బెయిల్‌పై కూడా విడుదలైంది.

కారణం యంత్రాగమే!
కొమ్మినేని వెంకటేశ్వరావు అరెస్ట్‌వల్ల వెలువడిన నిజాలను పరిశీలిస్తే.. ఆయన అలా మారడానికి యంత్రాంగమే కారణమని సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. గతంలో చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయితే.. ఆయన్ను ఓ జైలుకు తరలించారు. అక్కడ రాజు అనే వ్యక్తి పరిచయం కావడం దుబాయిలో మత్తుమందుల వ్యాపారానికి మార్గం సుళువయింది. చెక్‌ బౌన్స్‌ చేస్తే మాఫీయాతో సంబంధాలున్న జైలుగదుల్లో ఆయన్ను ఎందుకు ఉండాల్సి వచ్చింది. అంటే ఒక రకంగా యంత్రాంగమే ఆయన్ను అలా మార్చిందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. దొంగ మంచివాడితో సావాసం చేస్తే.. కాస్తన్నా మారడతాడు. కొంచెం మంచివాడిని.. దొంగలు దగ్గర పడేస్తే.. గజదొంగగా మారతాడు.. ఇదీ సీని పెద్దలు చెప్పి సత్యం...

ఇదొక పెద్ద మాఫియ
ఏది ఏమైనా ఇండిస్ట్రీలో మాఫియా బాగా చొచ్చుకుపోతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నటి ఆర్తీఅగర్వాల్‌ ఎప్పుడూ మత్తుగా ఉండేది. ఆమెకు మత్తుమందులతో సంబంధాలుండేవని అప్పట్లో అనేవారు. కానీ తన తండ్రితో కలిసి మందు కొడతాననీ, అది అమెరికాలో నా కల్చర్‌ అనే ఆమె సర్దుకునేది. ఆ మధ్య నటి ఛార్మి గెస్ట్‌హౌస్‌లో రవితేజ సోదరుడు రఘు, తరుణ్‌, నవదీప్‌తోపాటు మరికొంతమంది హీరోలు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుండగా పట్టుపడ్డారు. ఆ తర్వాత పోలీసు కేసు కావడం.. దాన్ని మాఫీ చేయడం వెంటవెంటనే జరిగాయి.

తీగలాగితే డొంకంతా కదిలినట్లు.. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్‌, రాజారవీంద్ర, రఘు, తరుణ్‌తోపాటు మరికొంతమంది హీరోల పేర్లు బయటకు వచ్చాయి. బాలీవుడ్‌ తరహాలోనే టాలీవుడ్‌ పయనిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ. ఈ డ్రగ్‌ వల్ల మనిషి యాక్టివ్‌గా ఉంటాడనీ... ఎంత శ్రమపడ్డా పైకి తెలీదని మత్తుమందువాడినవారు చెబుతుంటారు. మరి ఎంత ఏజ్‌ వచ్చినా కథానాయకులు ఇంకా హుషార్‌గా ఉండడం చూస్తే... వారు కూడా పుచ్చుకుంటున్నారేమోనని అనిపిస్తోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT