1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Meena

Srihari | Meena | Dasanna | Trailer | March | శ్రీహరి, మీనాల "దాసన్నా" ట్రైలర్స్ విడుదల

శ్రీహరి
WD
శ్రీహరి, మీనా కాంబినేషన్‌లో నటించిన "దాసన్నా" చిత్రం ట్రైలర్స్ విడుదలయ్యాయి. ట్రైలర్స్ విడుదల సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుని డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోందన్నారు. అన్ని కార్యక్రమాలను ముగించుకుని మార్చి మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.

రియల్‌స్టార్ శ్రీహరికి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రమిదని, తప్పకుండా "దాసన్నా" చిత్రం విజయవంతమవుతుందనే నమ్మకముందన్నారు.

శ్రీహరి మాట్లాడుతూ.. ఎన్నో రిస్క్‌లు తీసుకుని నట్టికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భద్రాచలం తర్వాత ఫిజికల్‌గా అంత శ్రమపడి చేసిన ఫైట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. కేరళలో అత్యద్భుతమైన లొకేషన్‌లో యూనిట్ తీవ్రంగా కృషిచేశారు. కృషికి తగ్గ ఫలితం వస్తుందని శ్రీహరి ఆశించారు.

శ్రీలేఖ మాట్లాడుతూ.. "శ్రీహరి చిత్రాలకు మూడింటికి పనిచేశాను. ఆయన చిత్రాలకు సంగీతం తక్కువగా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో పాటలకు ప్రాధాన్యత ఉంది. చక్కని మెలోడి సంగీతం అందించాను" అని శ్రీలేఖ అన్నారు.
About Writer
SELVI.M