Om Sairam | Sai Baba | Kota Srinivas Rao | Sabka Malik Ek | సాయిబాబా మహిమలకు అద్దం పట్టే "ఓం సాయిరాం"
WD
ఇంకా ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 18వ తేదీన హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని నిర్మాత జి.ఎల్.బి. శ్రీనివాస్ తెలిపారు.
సహ నిర్మాత శతృఘ్నుడు మాట్లాడుతూ.. "యదార్థ సంఘటనలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇందులో నేను భాగస్వామిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. గత నెలలో ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ఈ చిత్రం లోగో ఆవిష్కణ కార్యక్రమం జరిగింది" అని చెప్పారు.
మాటల రచయిత పోలూర్ ఘటికాచలం మాట్లాడుతూ.. "భక్తులకు కష్టాలు వస్తే బాబా ఎలా ఆదుకున్నాడనే అంశాలు కొత్తగా ఉంటాయని, ప్రత్యేకంగా క్లైమాక్స్‌లోబాబా గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి" అని అన్నారు.
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ నాలుగు భాషలలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎల్.బి.శ్రీరామ్, హేమ, రావ్‌రమేష్, చంద్రమోహన్, రవికిరణ్, సుధవాసన్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్ర సాంకేతిక సహకారం సంగీతం: చక్రి, మాటలు: పోలూర్ ఘటికాచలం, ఛాయాగ్రహణం: పి.ఎస్. బాబు, పాటలు: రామజోగయ్య, వెనిగళ్ళ రాంబాబు, గురుప్రసాద్, కలువసాయి, ఎడిటర్: నందమూరి హరి, సహనిర్మాత: కొత్తూరు శతృఘ్నుడు, సమర్పణ: గంటా సుజాతరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: జి.ఎల్.బి. శ్రీనివాస్.