1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. పాటల చిత్రీకరణలో "బద్మాష్"

Badmash, Vandemataram Srinivas, Naga Siddarth, Ekta | పాటల చిత్రీకరణలో "బద్మాష్"

బద్మాష్
సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ దర్శకునిగా మారి రూపొందిస్తున్న చిత్రం బద్మాష్. జి.పి.సిద్దార్థ్ ఫిలిమ్ అకాడమీ పతాకంపై డాక్టర్ జి. నాగయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ సిద్దార్థ్, ఏక్తా నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు.

నిర్మాత మాట్లాడుతూ... "టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ చేస్తున్నాం. ఇటీవల హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో ఈ చల్లని సాయంత్రం ఝమ్మంది లవ్ మంత్రం... పాటను చిత్రీకరించాం. ఈ పాటను స్వర్ణ నృత్య దర్శకత్వం వహించారు. ప్రస్తుతం గోల్కొండ పోర్ట్ పరిసరాల్లో "నిన్నా మొన్నా అటు మొన్నా నిన్నే చూసినా..." పాట చిత్రీకరిస్తున్నాం.

అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను మగధీర ఫేమ్ అనూజ్, రీటా పాడారు. ఇంకా 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని త్వరలోనే రాజస్థాన్, కులుమనాలి, గోవాల్లో చిత్రీకరిస్తాం" అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ... "ట్రెండ్‌కు తగ్గట్లుగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఫిలిమ్ ఇది. వినోదానికి పెద్దపీట వేస్తున్నాం. హీరో పాత్ర చాలా జోవియల్‌గా హుషారుగా ఉంటుంది. ప్రేమ కథలో కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నాం. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నా"మని తెలిపారు.

చంద్రమోహన్, సుమన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బాబుమోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, భగవత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.వి.గిరి, కెమేరా: ఎన్. సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాత: డా.జి.నాగయ్య, సంగీతం-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: వందేమాతరం శ్రీనివాస్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT