1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Gadde Sindhura

Killer Cinema | Gadde Sindhura | Miss India | షూటింగ్ పూర్తి చేసుకున్న "కిల్లర్"

కిల్లర్ సినిమా
WD
శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాశి దర్శకత్వంలో మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర హీరోయిన్‌గా నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ కిల్లర్ చిత్రం ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో పాట చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నగేష్ నారదాశి మాట్లాడుతూ... "గద్దె సింధూర మెయిన్ లీడ్‌గా చేస్తున్న పూర్తి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఐదు పాటలుంటాయి. మార్చి నెలలో పాటలను విడుదల చేసి ఏప్రిల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

గద్దె సింధూర, జీవా, రామిరెడ్డి, రవిప్రకాష్, పొన్నాంబళం, సుమన్ శెట్టి, తనికెళ్ల భరణి తదితరలు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమేరా: మధు. ఎ. నాయుడు, సంగీతం: శాయి కార్తీక్, నిర్మాత: కిరణ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాశి
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT