Aishwarya Rai | Reality Show | TV Show | కోట్లు ఇస్తేనే రియాల్టీ "షో" అంటోన్న ఐష్
అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ కుర్రహీరోయిన్ల తాకిడికి తట్టులేకపోతోందో ఏమో గానీ టీవీ రియాల్టీ షోలకు ఓకే అంటోదట. అయితే తను రియాల్టీ షోలు చేయాలంటే కోట్లకొలది డబ్బును పారితోషికంగా ఇస్తే వస్తానని షరతులు విధిస్తుందట. దీంతో ఆయా టీవీ చానల్స్ బెదిరిపోతున్నాయట.
కానీ కలర్స్ చానల్ మాత్రం ఐష్ ఎంత అడిగితే అంత ఇస్తామని ముందుకు ఉరుకుతోందట. అయినప్పటికీ ఐశ్వర్య విధిస్తున్న కొన్ని షరతుల వల్ల తాము ఆమెతో చేయాలనుకున్న రియాల్టీ షో కాస్త ఆలస్యమవుతోందని సదరు ఛానల్ చెప్పుకొస్తోంది.
ఐష్ మాత్రం కూల్‌గా తను అనుకున్నట్లుగా అన్నీ కుదిరితే... ఓ పాపాయిని కనేసి ఎంచక్కా రియాల్టీ షోలకు పరిమితమైపోదామని యోచిస్తున్నట్లు బాలీవుడ్ సినీజనం అంటున్నారు.
