మగధీర డీవీడీ కొత్త టెక్నాలజీల్లో వస్తుంది. బ్లూ- రే అనే టెక్నాలజీతో హాలీవుడ్ చిత్రాలు హోమ్ డీవీడీలో విడుదలవుతాయి. తెలుగులో తొలిసారిగా ఆ టెక్నాలజీ ద్వారా "మగధీర" విడుదలవుతోంది. బాలాజీ వీడియోస్ నిరంజన్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ డీవీడీని విడుదల చేస్తున్నారని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... యూఎస్, యూరప్ దేశాల్లో బ్లూ రే టెక్నాలజీ డీవీడీలు విడుదలవుతున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్నదైనా బాలాజీ వీడియోస్ నిరంజన్‌గారు ధైర్యం చేసి ముందుకు తెచ్చారు. ప్రతీ ఇంటిలో ఈ డీవీడీతో సినిమాను చక్కని క్లారిటీతో చూడొచ్చు అని పేర్కొన్నారు.
అలాగే చాలామంది స్నేహితులు మగధీర 100 రోజులు ఫంక్షన్ చేయలేదని అడుగుతున్నారు. ఫంక్షన్ చేయాలని అనుకున్నాం, కానీ అప్పటికి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు సరిగా లేనందున వాయిదా వేశాం" అని చెప్పారు. రాష్ట్ర పరిస్థితులు మెరుగైతే సిల్వర్ జూబ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నామని వివరించారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. బ్లూ రే టెక్నాలజీ వల్ల మామూలు డీవీడికంటే క్లారిటీ బాగా వస్తుందనీ, అలాగే సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుందనీ, ఈ డీవీడీతోపాటు సినిమా మేకింగ్ డీవీడి కూడా విడిగా ఉంటుందనీ, ఒకప్పుడు జాకీచాన్ చిత్రాలను అలా చూసేవాడినని అన్నారు. కీరవాణి మాట్లాడుతూ... డౌల్బీ సౌండ్ సిస్టమ్‌లో అన్నమయ్య చిత్రాన్ని కె. రాఘవేంద్రరావు విడుదల చేస్తే... ఆయన శిష్యుడు రాజమౌళి రూపొందించిన మగధీర బ్లూరే టెక్నాలజీతో మార్కెట్లోకి రావడం విశేషమని పేర్కొన్నారు.