1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Actor Mahesh babu

Manjula | Actor Mahesh babu | Cinema | Tollywood | మహేష్‌తో సినిమా అంటే మాటలు కాదు: మంజుల

మంజుల
WD
"తమ్ముడే... కానీ వాడి డేట్స్ కోసం నేను ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్నానో తెలుసా...? వాడితో సినిమా చేయాలంటే మాటలు కాద"ని అంటోంది మహేష్ బాబు సోదరి మంజుల. "మహేష్ బాబుతో సినిమా తీయడం అంటేనే గొప్ప కల. అందుకే తనతో ప్రతి సినిమా నా కలల చిత్రమే అవుతుంది.

తమ్ముడని కాదు కానీ... తనతో పనిచేయడం చాలా సంతోషంగా సౌకర్యవంతంగా ఉంటుంది. చాలా సరదాగా అందర్నీ నవ్విస్తూ జీవితంలో ఏ కష్టమొచ్చినా నవ్వుతూ ఉండాలని చెపుతుంటాడు. అవి నాన్నగారి నుంచి వాడికబ్బాయి. అందుకే వాడితో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.
WD


ఏ మాయ చేసావె మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకు ప్లాన్ చేస్తున్నా. గౌతమ్ మీనన్ కూడా మహేష్‌కు కథ సిద్ధం చేశారు. అందులో నాకు తగిన పాత్ర వస్తే నటిస్తాన"ని అంటోంది మంజుల.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT