1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Jai Telangana

Lenin Audio | Jai Telangana | Film Chamber | ఆడియో వేడుకలో "జై తెలంగాణా": "పులి" సైగతో గప్‌చిప్

లెనిన్ ఆడియో విడుదల
రాజకీయాల్లో అవినీతి నిర్మూలిస్తేనే దేశం బాగుపడుతుందనే కథాంశంతో "లెనిన్" అనే చిత్రం తయారవుతోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం ఫిలిమ్ ఛాంబర్లో జరిగింది. తెలంగాణా జర్నలిస్ట్ ఫోరం నాయకుడు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా వచ్చారు.

సీడీ విడుదల అనంతరం ఆయన మట్లాడుతుండగా.. "కార్యకర్తలు కొంతమంది జై తెలంగాణా అంటూ నినదించారు. చిత్ర దర్శకుడు పులి అమృత్ సైగ చేయగానే వెంటనే ఆపివేశారు. తర్వాత అల్లం నారాయణ మాట్లాడుతూ... "సినిమావాళ్లపై మాకేమీ కోపం లేదు. రాజకీయనాయకులు తెలంగాణా గొడవల్లో రకరకాలుగా స్పందించినా ఇండస్ట్రీ మాత్రం చాలా చక్కగా మాట్లాడింది. వారి మాటల్లో క్లారిటీ ఉంది. మేం ఇండస్ట్రీని కబ్జా చేయడం లేదు.

నిర్మాణంలో తెలంగాణావారు కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇంకా తెలంగాణావారు ఎక్కువగా ఇండస్ట్రీలోకి రావాలి. త్వరలో తెలంగాణాపై పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారు. అలాగే ఈమధ్య హైస్కూల్ ప్రేమాయణం వంటి కథలు వస్తున్నాయి. అలాంటివి కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలి" అన్నారు.

ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... "ఇండస్ట్రీని శాసిస్తున్న కొద్దిమందిపై ధ్వజమెత్తారు. ఒక్క వ్యక్తి దగ్గరే 250 థియేటర్లు ఉండటంతో... చిన్న సినిమాలకు దొరకడం లేదని వాపోయారు. ఇటీవలే రాజా హీరోగా నటించిన ఇంకోసారి చిత్రానికి థియేటర్ లేక ఓన్లీ మార్నింగ్ షోలు వేసుకునే అవకాశం లభించిందని, ఇక కొత్త హీరోల చిత్రాలకు దిక్కేమిటి. గతంలో వీటిపై వైఎస్ స్పందించారు. త్వరలో రోశయ్యను కలిసి మా సమస్యలు విన్నవిస్తామ"న్నారు. లెనిన్ సినిమాను త్వరలో విడుదల చేస్తామని చిత్ర దర్శకుడు పులి అమృత్ తెలిపారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT