Betting Bangarraju | Allari Naresh | Ramoji Rao | వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"
WD
నరేష్ మాట్లాడుతూ... పెద్ద సంస్థల్లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నది. గమ్యం తర్వాత నాగరాజు సంభాషణలు రాశారు. ఇందులో నాలుగు పాటలున్నాయి. బెండు అప్పారావు, బ్లేడు బాబ్జీలా ఇది సెంటిమెంట్ గా ఉంటుందని అందరూ అంటున్నారన్నారు.
చలపతిరావు మాట్లాడుతూ... ప్రస్తుతం నరేష్ యుగం నడుస్తోందనీ, ఏడాదికి 6 చిత్రాల్లో నటిస్తూ 10మందికి పని కల్పిస్తున్నాడని ప్రశంసించారు. మయూరి ఫిలిం సుధాకర్ మాట్లాడుతూ... మా బ్యానర్లో 84వ చిత్రమిది. కామెడీతోపాటు చిన్నపాటి సందేశం కూడా ఇందులో ఉందని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమేరా: కరుణమూర్తి, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: నాగేంద్ర, ప్రొడ్యూసర్: పొట్లూరి సత్యనారాయణ