Prakash raj | Bhumika Chavlaw | Collector gari Bharya | ప్రకాష్ రాజ్- భూమికల "కలెక్టర్ గారి భార్య"
WD
ఈ చిత్రం గురించి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. యూఎస్‌లో 23 ఏళ్లుగా ఉన్నాను. సినిమాలు పిచ్చిగా చూసేవాడిని. ప్రకాష్ రాజ్ గురించి కథను రాసుకున్నాను. రెండేళ్లుగా కథను సిద్ధం చేసుకుని వచ్చాను.
కమర్షియల్ సినిమా కాకుండా సమాజానికి ఏదో మేలు చేయాలని సినిమా తీశాను. ఆడపిల్ల తల్లిదండ్రులకు చక్కని సందేశం కూడా ఉంది. త్వరలో ఆడియోను ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తాం అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... కలెక్టర్ పేరుమీద సెంటిమెంట్ అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఈ సినిమా కూడా అవుతుందనే నమ్మకముందని అన్నారు. భూమిక మాట్లాడుతూ... స్పెషల్‌గా మహిళలకు సంబంధించిన సినిమా ఇది. ఇందులో మంచి పాత్ర పోషించానన్నారు.
శివపార్వతి మాట్లాడుతూ... స్త్రీ ప్రాధాన్యతగల సినిమా. పురిటిలోనే స్త్రీలను చంపేసే సమాజంలో ఉన్నాం. అటువంటి వారిని వేలెత్తి చూపే చిత్రమిది. ఇందులో మంచి పాత్ర పోషించాను అని చెప్పారు. ఈ సినిమాకు నిర్మాతలు: బి. వనితా రెడ్డి, ఎ. రాధికారెడ్డి