1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Collector gari Bharya

Prakash Raj | Collector gari Bharya | Bhumika Chavlaw | నాకు బ్రెయిన్ లేదు.. నేనేం చెప్పగలను: ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్
WD
"నాకు బ్రెయిన్ లేదు. నేనేమి చెప్పగలను" అని జాతీయస్థాయి నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో అనడం వెటకారమో... అతిశయోక్తో... ఏది అన్వయించుకోవచ్చో అనే సందిగ్ధావస్థ విలేకరులకు కలిగింది. లేటెస్ట్‌గా ఆయన భూమికతో కలిసి 'కలెక్టర్ గారి భార్య' చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరే ప్రధాన పాత్రలు.

భార్యాభర్తలు ఇగో వల్ల ఒకరికొకరు పోటీపడి సంసారానికి దూరంగా ఉంటారు. ఆ తర్వాత ఆమె ఉన్నత స్థితికి చేరుతుంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తప్పులు తెలుసుకుని కలిసిపోతారు. ఇదీ సినిమా కథ. ఈ చిత్రం గురించి చెప్పేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడారు.

"చిత్ర దర్శక నిర్మాత దిల్ రాజు ద్వారా కథ నా దగ్గరకు వచ్చింది. కథ బాగానే ఉంది. కానీ ఆయన తీయగలరో లేదో అని అనుమానంతో మంచి రైటర్స్‌ను తీసుకుని రండి అని చెప్పాను. వెంటనే పరుచూరి బ్రదర్స్‌ను తీసుకువచ్చారు. మంచి ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. భార్యభర్తల సంబంధాలు తెలియజెప్పే ఇటువంటి సినిమా నాకూ అవసరమే..." అంటూ ముగించారు.

అనంతరం కొద్దిమంది విలేకరులు ఆయనను ఇంటర్య్వూ అడిగారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఉగాది శుభాకాంక్షలు తెలియజేయమని కోరారు. దీంతో ఆయన ప్రతివారికి "నాకు బ్రెయిన్ లేదు. నేనేం చెప్పగలను..." అంటూ ముక్తాయింపు ఇచ్చారు. దీంతో గతంలో నిజజీవితంతో తన భార్యను వదిలి వేరే మరో అమ్మాయిని పెండ్లి చేసుకుంటున్నాడనే సందర్భంలో... ఆయన నటిస్తున్న చిత్రంలో ఆదర్శవంతమైన తండ్రిగా అంతా నటనే అంటూ పలు వెబ్‌సైట్లలో ప్రకాష్ రాజ్ చెప్పేదొకటి... అంటూ రకరకాలు కథనాలు రాశారు.

దీంతో ఆయన ఈ రకంగా తనకు బ్రెయిన్ లేదని చెప్పి వారికే బ్రెయిన్ లేదనేలా మాట్లాడినట్లు అవగతమవుతోంది. ఇకపోతే కలెక్టర్ గారి భార్య చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT