1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Actresses

Actress Mother | Actresses | Tollywood | Actor | Pubs and Clubs | పరిచయాలు పెంచుకోండీ..!!: హీరోయిన్ల తల్లులు

నటీమణులు
WD
కాలంతోపాటు అభిరుచులు మారాయి. విలువలూ మారుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ తల్లులు తమ పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలని చూస్తుండేవారు. కూతుళ్లకు రక్షణ కవచంగా ఉండేవారు. షాట్ పూర్తవగానే హీరోయిన్ వచ్చి తల్లి ప్రక్కనే కూర్చునేది.

టాప్ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్ తల్లి కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉండేవి. గంట అదనంగా చేయాలంటే తల్లులు పేచీ పెట్టేవారు. తమ కూతుళ్లు హీరోలతో చనువుగా బహిరంగంగా మాట్లాడనిచ్చేవారు కాదు. మరి ఇప్పుడు అంతా మారిపోయింది. హీరోయిన్ తల్లులే హీరోలతో చాలా కలివిడిగా ఉంటున్నారు.

యువహీరోలను తమ ఇంటికో లేదంటే క్లబ్‌లకో పిలిచి పార్టీలివ్వడం ఆనవాయితీ అయింది. కూతుళ్లను హీరోలతో స్నేహం చేసే వాతావరణాన్ని వారే స్వయంగా కల్పిస్తున్నారు. ఈ మధ్యనే పేరున్న ఒక పెద్ద హీరో... "హీరోయిన్ల తల్లులు చాలా సహకరిస్తున్నార"ని స్టేట్మెంట్ ఇచ్చాడు.

మారుతున్న కాలంతోపాటు అందరూ మారాల్సిన అవసరం ఏర్పడిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. రోజుకో భామ వస్తున్న ఇండస్ట్రీలో... ఉన్నన్ని రోజులు పేరు, డబ్బు సంపాదించుకోవడానికి పడరాని పాట్లు పడటం అంటే ఇదేనేమో!!
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT