1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. 155 కేంద్రాల్లో ఎన్టీఆర్ "అదుర్స్" అర్థ శతదినోత్సవం

Adurs, 155 Theaters, Junior NTR, Vinayak | 155 కేంద్రాల్లో ఎన్టీఆర్ "అదుర్స్" అర్థ శతదినోత్సవం

అదుర్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన అదుర్స్ దిగ్విజయంగా అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత వల్లభనేని వంశీమోహన్ మాట్లాడుతూ... అదుర్స్ చిత్రం సంక్రాంతి విజయాన్ని సాధించి 155 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని దిగ్వజయంగా శతదినోత్సవానికి పరుగులు తీస్తోందన్నారు. ఈ చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT