1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. మార్చి 7న అల్లు అర్జున్ "వరుడు" ఆడియో

Varudu, Allu Arjun, Gunasekhar, Audio | మార్చి 7న అల్లు అర్జున్ "వరుడు" ఆడియో

వరుడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్చి 7న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం అద్భుతంగా రూపొందింది. ఈ చిత్రానికి మణిశర్మ సూపర్ పాటలు అందించారు. ఈ సూపర్ హిట్ ఆడియోను మార్చి 7న ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నామన్నారు.

మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన కొత్త హీరోయిన్ నటిస్తుండగా ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించడం విశేషం
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT